ఐదో సీటు మనదే.. బెంగ వద్దు
టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో కేసీఆర్ భరోసా
నేడు గుట్టకు ముఖ్యమంత్రి
హైదరాబాద్, మే29(జనంసాక్షి) :
తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున ఐదో అభ్యర్థిని
గెలిపించు కుంటామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్ని కలపై చర్చించారు. జూన్ 1న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఓటింగ్ వేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఏడుగురు బరిలో ఉన్న విషయం తెలిసిందే. మావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఐదో అభ్యర్థిని కచ్చితంగా గెలిపించుకుంటామని, అన్ని ఆలోచించే నిలబెట్టా మని చెప్పారు. ఎమ్మె ల్సీ ఎన్నికల్లో అను స రించాల్సిన వ్యూహం పై కేసీఆర్ ఎమ్మె ల్యేలకు అవగాహన కల్పించారు. శని, ఆ దావిరాల్లో మాక్ పో లింగ్ నిర్వహించాల ని నిర్ణయించారు. తె లంగాణ శాసనమండ లికి ఎమ్మెల్యేల కోటా లో జరిగే ఆరు స్థానా లకు గాను టీఆర్‌ఎస్ ఐదో అభ్యర్థిని నిలబె ట్టడంతో ఎన్నికలు అ నివార్య మయ్యాయి. కాంగ్రెస్ ఓ స్థానానికి, టీడీపీ బీజేపీ కూటమి మరో స్థానానికి పోటీ పడుతున్నాయి. యాదగిరి గుట్ట దేవా లయ అభివృద్ధి అథారిటీ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసిం హన్, చినజీయర్‌స్వామి పాల్గొననున్నారు.మొదట పెద్దగుట్ట వద్ద శంకు స్థాపన చేసి రాజగోపురం పను లను సీఎం ప్రారంభించనున్నారు. అనం తరం అథారిటీ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. సీఎం గుట్ట పర్య టన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే యాదగిరి గుట్ట అథారిటీని ఏర్పాటు చేసి వందకోట్ల నిధులు కేటాయించారు. గుట్ట నుంచి రాయగిరి వరకు నాలుగలేన్ల రోడ్డుకు శంకుస్తాపన చేశారు. సిఎం నిర్ణయంతో యాదగిరి గుట్ట త్వరితగతిన అభివృద్ధి మార్గం ఏర్పడింది. ఇప్పటికే వందకోట్ల రూపాయలు విడుదల చేసిన విషయం తెలిసిందే.