ఐపీఎల్ ఆరంభం అదుర్స్: అనుష్క అందాలు, హృతిక్ ఫెర్పామెన్స్
కోల్‌కత్తా: వర్షం ఆటంకం కలిగించినా… ఐపీఎల్ 8వ ఎడిషన్ వేడుకలు కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ స్డేడియంలో అట్టహాసంగా జరిగాయి. వర్షం వల్ల అనుకున్న సమయానికన్న రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమం మొదలైంది. షెడ్యూల్ ప్రకా రం రాత్రి 7 గంటలకే ఆరంభం కావాల్సి ఉంది. దీంతో వేడుకలను కుదించారు. ఈ వేడుకకు వ్యాఖ్యాతగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, అభిమానుల హర్షధ్వనాల మధ్య ఎనిమిది జట్ల కెప్టెన్లను వేదికపైకి ఆహ్వానించాడు. ప్రతి ఏడాదిలాగే కెప్టెన్లందరూ ఎమ్‌సీసీ క్రీడా స్పూర్తిని ప్రమాణాన్ని చేసి, బ్యాట్‌పై సంతకాలు చేశారు. ట్రోఫీ ముందు ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం సినీనటుడు షాషిద్‌కపూర్ బైక్ నడుపుతూ వేదికపైకి వచ్చి డిస్కో డాన్సర్ పాటకు నృత్యం చేశాడు. తర్వాత అనుష్క శర్మ తన అంద చందాలతో ఉర్రూతలూగించింది. నటుడు, గాయకుడు ఫర్హాన్ అక్తర్ తన ఆటపాటలతో అదరగొట్టారు. చివరిగా స్టయిలిష్ హీరో హృతిక్ రోషన్ కళ్లు చెదిరే ప్రదర్శనతో కార్యక్రమం ముగిసింది. తన తొలి సినిమా ‘కహోనా ప్యార్ హై’తో మొదలెట్టి ధూమ్ మచాలే పాటలకు డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు. అనంతరం సైఫ్ ఆలీఖాన్ మాట్లాడుతూ ఐపీఎల్-8 ప్రారంభమైనట్లు లాంఛనంగా ప్రకటించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ ఎడిషన్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. 47 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ ఐపీఎల్ టోర్నీ 47 రోజుల పాటు జరగనుంది. ఈరోజు సాయంత్రం జరగనున్న తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఈడెన్ గార్డెన్స్‌లో తలపడనున్నాయి. ఐపీఎల్ ఆరంభం అదుర్స్: అనుష్క అందాలు, హృతిక్ ఫెర్పామెన్స్(ఫోటోలు) 1/14 అట్టహాసంగా జరిగిన ఐపీఎల్ ప్రారంభోత్సవం బాలీవుడ్ తారల జిలుగులు, బాణసంచా వెలుగుల మధ్య కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ స్డేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 8వ ఎడిషన్ వేడుకల ఘనంగా ప్రారంభమయ్యాయి.