ఐలమ్మకు ఘననివాళి
పెద్దపల్లి,జూన25(జనంసాక్షి)
పట్టణంలోని తిలక్‌నగర్‌లో తెలంగాణ వీర వనిత చాకలిఐలమ్మ విగ్రహం ఆవిష్కరించి ఒక సంవత్సరం సంధర్భంగా రజకులు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం తిలక్‌నగరలో మాజీఎంపీటీసీ, టీడీపీ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతు నిజాం రజాకర్లతో దేశముఖులతో పోరాడిన మహయోధురాలు తెలం గాణ వీరవనిత చాకలి ఐలమ్మ బావితరలకు ఆదర్శంగా ఉండే విధంగా పాఠ్యపుస్తకాలలో చేర్పిం చాలని మరియు హైదారాబాద్ ట్యాంక్‌బండ్‌పై చాకలిఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి డిమాండ్ చేసారు. ఈకార్యక్రమంలో తిరుపతి, మల్లేశం, శ్రీనివాస్, శంకరమ్మ, లత, లక్ష్మీ, లక్ష్మన్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.