ఐలమ్మ స్ఫూర్తి మరువలేనిది…

రజాకార్లను ఎదిరించిన వీర వనిత…
తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత
శంకరపట్నం జనం సాక్షి
సెప్టెంబర్ 24
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, రజాకారులతో, భూస్వామ్య పెత్తందారుల ఎదు రొడ్డి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ స్పూర్తి మరువలేనిదని, మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారధి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం శంకరపట్నం కేంద్రంలోని కేశవపట్నం బస్టాండ్ ఎదురుగా శ్రీ మల్లేశ్వర రజక సంఘం శంకరపట్నం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ కల్లేపెల్లి క్రాంతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐరమ్మ స్ఫూర్తి, ప్రతి మహిళ లోకం అవలంబించుకొని, హక్కుల సాధనకు ఉద్యమించాలని, రజాకారుల కాలంలో నాటి భూస్వామ్య పెద్దందారులతో దున్నేవాడిదే భూమి అని ఉద్యమించి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని, నాటి భూస్వామ్య పెత్తందారుల వ్యవస్థలో పేద బడుగు బలహీన వర్గాల ను, ఏకం చేసి పేదల ప్రజల్లో ఐలమ్మ నిలిచిందని ఐలమ్మ సేవలను కొనియాడారు. వీరవనితో చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయుటకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రతి రజకబిడ్డ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రజక కుటుంబాల అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో, వసతి గృహాల్లో, రజకులకు లే కులవృత్తి చేసుకోవడానికి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఉమ్మెoతల సరోజన, వైస్ ఎంపీపీ పులి కట రమేష్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు పెద్ది శ్రీనివాసరెడ్డి సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల వీరాస్వామి, సింగిల్ విండో చైర్మన్లు సంజీవరెడ్డి ,తిరుపతిరెడ్డి, రజక సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్ రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొలిపాక సారయ్య, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, వివిధ రాజకీయ పార్టీల మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మండల అధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి రాస మల్ల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు దండు కొమురయ్య, కల్లేపల్లి రాజయ్య, ఉపాధ్యక్షులు, నాంపల్లి శంకరయ్య, ఆదిత్య, వివిధ మండలాల రజక సంఘం అధ్యక్షులు, కులస్తులు , మాజీ ప్రజా ప్రతినిధులు,వివిధ కుల ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.