ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన మహిళ

చండీగడ్: ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చి ఓ మహిళ రికార్డు సృష్టించింది. దేశంలో ఇప్పటి వరకు ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన మహిళ ఈమె ఒక్కరే. పంజాబ్ లోని ఆ మాతృమూర్తి పేరు కుల్దీప్ కౌర్ (32). కుల్దీప్, ముగ్గురు ఆడపిల్లలు క్షేమంగా ఉన్నారు. ఇద్దరు పిల్లలు బరువు చాల తక్కువగా ఉన్నారని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. పంజాబ్ లోని భటిండా సమీపంలోని గిద్దరాణి అనే గ్రామంలో సుఖ్ పాల్ సింగ్, కుల్దీప్ కౌర్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇప్పటికే ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుఖ్ పాల్ సింగ్ రైతు. సొంత గ్రామంలో ఈయన వ్యవసాయం చేస్తున్నాడు. కుల్దీప్ కౌర్ గర్బవతి కావడంతో చికిత్స చేయించారు. కుడుపులో నలుగురు బిడ్డలు ఉన్నారని తెలుసుకున్నారు. నలుగురు బిడ్డలు ఆడపిల్లలే అని తెలిసినా వీరు ధైర్యంగా తాము పెంచుకుంటామని అబార్షన్ చేయించ లేదు.
స్కానింగ్ లో నలుగురు ఆడపిల్లలు అని తెలుసుకున్న వైద్యులు ధైర్యంగా కుల్దీప్ కౌర్ కు డెలివరి చెయ్యడానికి వెనుకడుగు వేశారు. తరువాత హర్ కిరణ్ కౌర్ అనే వైద్యురాలు కుల్దీప్ కు వైద్యం అందించారు. మొదట నలుగురు బిడ్డలు అనుకున్నా, చివరికి ఐదుగురు పిల్లలు పుట్టారు. కుల్దీప్ కౌర్ కేవలం 5 గ్రాముల హెమోగ్లోబిన్ తో ఆసుపత్రికి వచ్చారని, పుట్టిన ఇద్దరు పిల్లలు 850 గ్రాముల బరువు ఉన్నారని డాక్టర్ హర్ కిరణ్ కౌర్ అంటున్నారు. ముగ్గురు పిల్లలు, తల్లి క్షేమంగా ఉన్నారని, ఇద్దరు పిల్లలకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. మొత్తం 7 గురు ఆడపిల్లలను పెంచుకుంటామని పేద దంపతులు ధైర్యంగా చెప్పడంతో వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.