ఒక సంచిలో రెండు విత్తనాలు…వరి సీడ్ లో కల్తీ జరిగిందా…

కొనుగోలు చేసింది ఆగ్రోస్ లోనే అంటున్న రైతులు

 

వరి పంటను శాస్త్రీయంగా పరిశీలించి వివరాలు ఇస్తాం:అగ్రికల్చర్ శాస్త్రవేత్త డాక్టర్ మాలతి

 

కొత్తగూడ అక్టోబర్ 12 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం మైలారం గ్రామంలో 20 ఎకరాల్లో రైతులకు తీవ్ర నష్టం…స్థానిక ఆగ్రోస్ రైతు కేంద్రాలలో 1001 సీడ్స్ కొనుగోలు చేసిన రైతులు తీర పంట చేతికి వచ్చే సమయానికి ఒక దుంపలో రెండు రకాల విత్తనాల తో కనిపించడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.అన్ని పంటలతో పోలిస్తే 1010 సీడ్ 15 నుండి 20 రోజులు ముందుగా కోతకు రావడం జరుగుతుంది.1001 రకం తో పాటు 1010 రకం మిక్సింగ్ అయి ఓకే దుంపగా ఉండడంతో ముందుగా వచ్చిన పంట పూర్తిగా నేలపాలై తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు.రైతుల సమస్యపై వ్యవసాయ శాస్త్రవేత్తలు,అధికారులు మండలం లోని సందర్శించారు.కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ మాలతి మాట్లాడుతూ 3 శాతం నుండి 5శాతం వరకు మిక్సింగ్ ఉండడం జరిగిందని,ఎక్కువ ఉన్నచోట అధికంగా 10 శాతం వరకు ఉందని అన్నారు.రైతులు కొద్దిపాటి యూరియా చల్లడం వల్ల పొట్ట దశలో ముందుగా వచ్చే వరి పంట లేటుగా రావడం తో నష్టం తగ్గించే అవకాశం ఉందని,పంట మొత్తం సమానంగా రావడం జరుగుతుంది.వరి యొక్క పూర్తి మొత్తంను శాస్త్రీయంగా లెక్కకట్టి పూర్తి వివరాలు తెలంగాణ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు తెలపడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎస్ సీడ్స్ డీఎం రఘు,ఏడిఎం లక్ష్మినారాయణ,మండల వ్యవసాయ అధికారి ఉదయ్,ఏ ఈ ఓ రాజు యశ్వంత్,స్థానిక రైతులు పాల్గొన్నారు.