ఒడిషాకు మళ్లిన ‘రోను’ తుపాను

1

విజయవాడ,మే 20(జనంసాక్షి): ఆంధ్రప్రదేa తీరంపై తుపాను తీవ్రత తగ్గింది. బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేa తీరానికి సమాంతరంగా కదులుతున్న రోను.. తుపాను వేగాన్ని పుంజుకుంది. వేగంగా ఒడిశా తీరవైపు కదులుతుండటంతో  దీని ప్రభావం తగ్గింది. దీంతో ఎపికి ము ప్పు తప్పిందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం కళింగపట్నంకు దక్షి ణ ఆగ్నేయంగా 40 కిలోవిూటర్ల దూరంలో స్థిరంగా కదులుతోంది. గంట కు 17 కిలోవిూటర్ల వేగంతో.. ఉత్తర ఈశాన్యంగా ఒడిశా తీరం వైపు ప యనిస్తోంది. మందస్తు అంచనాల ప్రకారం ఉదయం 5.30గంటలకు ఏ పీ తీరంలోనే తీవ్ర తుపానుగా మారుతుందని భావించారు. అయితే ఇది.. ఈ రాత్రికి ఒడిశా తీరంలో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణశాఖ అంచనావేస్తోంది. తుపాను ప్రభావంతో ఉత్తరకోస్తా, గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కళింగపట్నంలో 15, విశాఖలో 8, మచిలీపట్నంలో 7, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, ఒంగోలులో 6 సెం.విూ, గన్నవరం, బాపట్ల, తునిలో 3 సెంంటీ విూటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ఒడిశా తీరంవైపు వెళ్లిపోవడంతో… దక్షిణ కోస్తాకు వర్షాలు లేనట్లే. ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాలపై ఈ రాత్రి వరకూ తుపాను ప్రభావం ఉండే అవకాశముంది. రోను తుఫాను ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై అధికంగా ఉంటుందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. జిల్లాలోని టెక్కలిలో వర్ష ప్రభావిత ప్రాంతాలను అచ్చెన్నాయుడు పరిశీలించారు. రహదారికి అడ్డంగా పడివున్న చెట్లను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. ఎన్టీఆంనగం కాలనీలో పలు వీధుల్లో తిరిగారు. నీటి ప్రవాహానికి అడ్డంగా నిర్మించిన గోడలను, అక్రమకట్టడాలను స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్డీవో ఆఫీసు నుంచి తీర ప్రాంత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రెండు రోజుల్లో తుఫాను తీవ్రత జిల్లాకే అధికంగా ఉందని పోలీస్‌, రెవెన్యూ, విద్యు’ రాష్టాల్ర అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

క్షేమంగా తిరిగొచ్చిన మత్స్యకారులు

గుంటూరు జిల్లా నిజాంపట్నం నుంచి ఐదు రోజుల క్రితం సముద్రంలో చేపలవేటకు వెళ్లిన 18 మంది మత్స్యకారుల్లో శుక్రవారం ఐదుగురు తీరానికి చేరుకున్నారు. మిగిలిన 13 మందిలో ఆరుగురు ఈ సాయంత్రానికి తీరానికి వస్తారని వారి కుటుంబసభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా మరో ఏడుగురి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వీరిలో కె.రవి, సీహెక.రవి, మల్లేశ్వరరావు, మొగదారయ్య, వెంకటేశ్వరరావు ఏసు, బాబూరావులు ఉన్నారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు..