ఒబామా! గో బ్యాక్
స్వేచ్ఛాదినాన సామ్రాజ్యవాది పర్యటననా?
బేగంపేట అమెరికా రాయబార కార్యాలయం ముందు వామపక్షాల ఆందోళన
హైదరాబాద్,జనవరి24(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ రాకను నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా రాయబారి కార్యాలయం వద్ద సీపీఐ ఆందోళనకు దిగింది. సీపీఐ నేతలు నారాయణ, గుండా మల్లేష్ నేతృత్వంలో ఆపార్టీ కార్యకర్తలు కాన్సులేట్ వద్దకు చేరుకుని ఒబామాకు వ్యతిరేకంగా నినదించారు. ఒబామా గోబ్యాక్ అని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. బేగంపేట ఏసీపీ ఎం.జి.రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద సంఖ్య అక్కడికి చేరుకుని సీపీఐ నేతలు కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్యం, స్వావలంబను మోడీ అమెరికాకు దాసోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో రక్షణ ఒప్పందాన్ని రక్షణశాఖ మంత్రి ఎకెఅంటోని వ్యతిరేకించడంతో ఆగిపోయిందని చెప్పారు. కానీ ప్రస్తుత ప్రధాని మోడీ బహుళ జాతి కంపెనీలకు అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. మోడీ ప్రజాస్వమ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా, బహుళజాతి కంపెనీలకు మోడీ ఆహ్వానం పకలకడం సరికాదన్నారు. ఒబామా పర్యటన భారత ప్రజా ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. ఇక్కడి వనరులను దోచుకునేందుకు మా/-తరమే ఒబామా వస్తున్నారని భారత్‌పై ప్రేమతో కాదన్నారు.