ఓఎంసీ రాజగోపాల్‌ బెయిల్‌పై విడుదల

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితుడు రాజగోపాల్‌ ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. రాజగోపాల్‌ సంవత్సరం పైగా ఈ కేసులో నిందితుడిగా జైల్లో ఉన్నారు. మధ్యంతర బెయిల్‌పై కొంత కాలం బయట ఉన్నాడు. బెయిల్‌ రద్దు కావడంతో రాజగోపాల్‌ జైలుకు వెళ్లాడు. శుక్రవారం ఆయన నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.