ఓటమిని అంగీకరిస్తున్నం..కిరణ్‌ బేడీ

2

న్యూఢిల్లీ,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఢిల్లీ ఎన్నికల్లో పరాజయాన్ని  కిరణ్‌బేదీ  అంగీకరించారు. ఆమె ఆప్‌ నేత బగ్గా చేతిలో ఓడిపోయారు. ఓటమికి కారణాలపై పార్టీలో విశ్లేషణ జరుపుతాం’ అని బేదీ ట్వీట్‌ చేశారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్‌బేడీ కృష్ణనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘కృష్ణనగర్‌ నియోజకవర్గ ప్రజలు తనను వ్యతిరేకించినప్పటికీ, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన భాజపాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలను ఆప్‌ అధినేత కేజీవ్రాల్‌ నెరవేరుస్తారని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ అభివృద్దికి కేజ్రీవాల్‌ కృషి చేస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే ట్విట్టర్‌లో ఫలితాలు వెలువడిన వెంఠనే కిరణ్‌బేడీ చేసిన ట్వీట్‌లు దుమారం రేపాయి. ఫలితాల సరళిని చూసి విస్తుపోయిన బీజేపీ సీఎం అభ్యర్థి అసహనం వెళ్లగక్కారు. ఓడిపోయింది తనుకాదని, బీజేపీ ఓడిపోయిందని తొలుత కిరణ్‌బేడీ ట్వీట్‌ చేశారు. తర్వాత తేరుకుని మళ్లీ కేజ్రీవాల్‌కు అభినందనలు తెలుపుకూ రీట్వీట్‌ చేశారు.