ఓటమి భయంతోనే తెరాసా పార్టీ బిజెపి నాయకులపై దాడులు చేయిస్తుంది: బిజెపి

నేరేడుచర్ల,జనంసాక్షి న్యూస్.గత పది రోజులుగా భారతీయ జనతా పార్టీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి  ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం లోని పంతంగి గ్రామంలో రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రమ్మరధం పడుతున్నారని నేరేడుచర్ల మండల అధ్యక్షులు పార్తనబోయిన విజయ్ కుమార్ యాదవ్ అన్నారు. మునుగోడు లో ప్రజలు బిజెపి అభ్యర్ధి రాజ్ గోపాలరెడ్డి గెలుపును కాంక్షిస్తున్నారన్నారని  బిజెపి విజయానికి చేరువలో ఉండడంతోనే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం సహించలేక కొంతమంది తెరాసా పార్టీ గూండాలచే బిజెపి నాయకులపై కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నదని ఈ దాడిని చూస్తూ పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తుందన్నారు. దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  ఎన్ని దాడులు చేసిన దానికి  మునుగోడు ప్రజలు 3వ తేదీన సమాధానం  చెప్తారన్నారు. ఈ రాచరికపు పాలన నుండి ప్రజలు విముక్తి కోసం మీకు దీర్ఘకాలిక సెలవు ప్రకటించే  రోజులు దగ్గర లోనే ఉందన్నారు.మునుగోడు లో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయం మునుగోడు ప్రజలు తమ పై పూర్తి విశ్వాసం తో ఉన్నారన్నారని 2023 లో తెలంగాణ లో కాషాయపు జెండా ఎగురుతుంది అని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అంబటి లెనిన్, ప్రధాన కార్యదర్శిలు పగిడి శ్రీనివాస్, దిద్దకుంట్ల విజయ్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు చింతలచెర్వు సతీష్, సోషల్ మీడియా ఇంచార్జ్ పుల్లెంల సైదులు, మండల కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి వెంకన్న, జొన్నలగడ్డ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు