ఓటరు నమోదును యువత సద్వినియోగం చేసుకోవాలి : చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షులు తోట మహేష్ యాదవ్
ఓటరు నమోదును యువత సద్వినియోగం చేసుకోవాలని చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షులు తోట మహేష్ యాదవ్ అన్నారు. చైతన్యపురి డివిజన్ మారుతీ నగర్ లోని రఘునాథ మోడల్ స్కూల్ వద్ద తోట మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు హక్కు పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ ఓటరు జాబితాను చెక్ చేసుకుని తమ వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని సూచించారు. కొత్త ఓటర్ నమోదు ఆన్లైన్లో చెక్ చేసుకునేందుకు ఈనెల 9 వ తేదీ వరకు గడువు ఉన్న నేపథ్యంలో అర్హులైన వారందరూ ఓటరు నమోదు చేసుకునేలా చూడాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తోటమ్ రాజు యాదవ్సం,పత్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.