ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
…. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 28 :::::
జిల్లాలో వచ్చే నెల 2, 3 తేదీల్లో ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. ప్రత్యేక శిబిరాలను ప్రజలు, యువత సద్వినియోగం కోవాలని కోరారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26,27 తేదీలలో జిల్లాలోని 1594 పోలింగ్ కేంద్రాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలలో ఫారం – 6, (15,114 ),
ఫారం – 7 (122 ),
ఫారం – 8 ( 907 ) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
18 సంవత్సరాలు నిండిన వారు, అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.
ప్రత్యేక శిబిరాల రోజులలో జిల్లా లోని అన్ని పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారని తెలిపారు. కొత్తగా ఓటరు నమోదుకు ఫారం- 6, సవరణలు, మార్పులు, చేర్పులకు ఫారం 8, తొలగింపుకు ఫారం 7 ను వినియోగించు
కోవాలని తెలిపారు. ఆయా ఫారాలు అన్ని పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ప్రత్యేక ఓటరు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నదీ లేనిది, ఏవేని తప్పులు ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలని కోరారు.
స్థానిక బిఎల్ఓ లేదా voters.eci.gov.in వెబ్ సైట్ లో లేదా ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా ఫారం -6 నింపి ఓటరుగా నమోదు, ఫారం – 8 నింపి సవరణలు చేసుకోవచ్చని తెలిపారు.
అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాలని కలెక్టర్ సూచించారు.