ఓటర్ల నమోదుకు ప్రత్యేక సమ్మర్‌ రివిజన్‌

వరంగల్‌, అక్టోబర్‌ 29 :  ఓటర్ల నమోదు ప్రత్యేక సమ్మరి రివిజన్‌ 2013 పరిశీలించడానికి జిల్లాకు వచ్చిన ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ శ్రీనివాస్‌ నరేష్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా సోమవారం సర్క్యూట్‌ గెస్టు హౌజ్‌లో మర్యాద పూర్వకంగా కలుసుకొని సమ్మరి రివిజన్‌ గురించి వివరించారు. అభ్యర్థులు ఫారం-6లో 42104 మంది, ఫారం-7లో 512మంది, ఫారం-8లో 8736, ఫారం-8ఎ, 806ఓటర్ల నమోదుకై దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జిల్లాలో 2969 పోలింగ్‌ క్దేంరాలు ఉన్నాయని వాటిలో 52 కొత్తవి అని తెలిపారు. జనాభా లెక్కల ప్రకారం 994 సెక్స్‌ రేషియో ఉండగా ఓటర్ల్‌ ప్రకారం 989 ఉందని తెలిపారు. జిల్లాలో 23,63, 118 ఓటర్లు నమోదు అయ్యారని తెలిపారు. సమ్మరి రివిజన్‌ 2.61 శాతం అదనంగా నమోదు అయ్యారని తెలిపారు. 2.19 శాతం ఓటర్లను వివిధ కారణాల చేత లిస్ట్‌ నుంచి తొలగించగా 0.43 శాతం ఓటర్లు అదనంగా నమోదు అయ్యారని తెలిపారు. జిల్లాలో రాజకీయ పార్టీలు 4961 బూత్‌ స్థాయి సహాయకులను నియమించాలమని తెలిపారు. వీరందరికి శిక్షణ ఇచ్చామని తెలిపారు.