ఓటుకు నోటు కేసులో హరీశ్‌ రావత్‌కు సీబీఐ నోటీసులు

2

న్యూఢిల్లీ,మే22(జనంసాక్షి): ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్‌ సీఎం హరీశ్‌ రావత్‌ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం సీబీఐ ప్రధాన కార్యలయంలో విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు అందజేసింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ బలనిరూపణకు ముందు..  స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోలో సీఎం రావత్‌ ఎమ్మెల్యేలను బేరమాడుతున్నట్లుగా కూడా కనిపించడం కలకలంరేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఆయనను విచారిస్తోంది. కాగా, మే 10న రావత్‌ బలనిరూపణ పరీక్షలో రావత్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. సీబీఐ ఇప్పటివరకు రావత్‌ కు మూడుసార్లు సమన్లు జారీ చేసింది.