ఓటును పొందే అవకాశాన్ని సద్వినయోగం చేసుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్17(జనంసాక్షి): పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత తప్పని సరిగా ఓటు హక్కు పొందాలని కలెక్టర్ రజత్‌కు మార్‌షైనీ పిలుపునిచ్చారు.ఓటురుగా నమోదుకు ఫారం -6ను తహసీల్దార్ కార్యాలయంలోను, ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద బూత్ లెవల్ అధికారి వద్ద పొంది ఓటరు పూర్తి వివరాలను నమోదు చేసి ఇవ్వాలన్నారు. వెబ్‌సైట్ ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఇకపోతే శని, ఆదివారాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టగా మంచి స్పందన వచ్చిందన్నారు. ఓటు హక్కు మహాశక్తివంత మైందని, ఇటువంటి అవకాశాన్‌ఇన సద్వినియోగం చేసుకునేందుకు ఓటును పొందాలన్నారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కుకు అర్హులన్నారు. 25వ తేదీ వరకు ఓటరు నమోదు కార్యక్రమం విస్తృతంగా చేపడుతున్నామన్నారు. గ్రామస్థాయిలో ప్రచారం చేపడుతున్నామన్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా ఓటరు నమోదు ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయ న వివరించారు. కళాకారులతో గ్రామస్థాయిలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఓటరు నమోదు తప్పులు సరిచేసుకునేందుకు ఫామ్-8 ద్వారా వివరాలు అందివ్వాలన్నారు.