ఓపన్ స్కూల్ ను సద్వినియోగం చేసుకోవాలి

జహీరాబాద్ జులై 23( జనంసాక్షి)బడిమనిన విద్యార్థులు ఆసక్తి ఉంటే ఓపన్ స్కూల్ విద్యా విధానం ను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరిద్ అన్నారు. ఓపన్ స్కూల్ ద్వార 10 వ తరగతిలో పాస్ అయిన మాజీ కౌన్సలర్ రాములునేత ను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిమానిన విద్యార్థులకోసం తెలంగాణ ప్రభుత్వం ఓపన్ స్కూల్ విదానం ద్వారా బడిమానిన విద్యార్థులను తిరిగి బడిలో చేర్చుకోని వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు 10 వ తరగతి పరిక్షలు రాయుటకు సిద్ధం చేయడం సంతోషం అన్నారు. ఈ విధానం తో పరిక్షలు రాసిన రాములునేత పదవతరగతిలో 6.8 శాతం మార్కులు సాధించారు అందుకు దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ శేఖ్ ఫరీద్ తనతోటి మాజీ కౌన్సలర్లు మోతీరాం రాథోడ్ మహమ్మద్ జహాగీర్ మహమ్మద్ అబ్దుల్లా సన్మానించారు. అందుకు సంతోషం తో కృతజ్ఞతలు తెలిసిన రాములునేత ఎవరైన బడిమానిన విద్యార్థులు ఆసక్తి ఉంటే ఓపన్ స్కూల్ విద్యా విధానం ను ఉపయోగించుకొని భవిష్యత్ లో ఉనత చదువులు చదవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.