ఓయూ విద్యార్ధిని హత్యకేసులో నిందితుడి అరెస్టు

హైదరాబాద్‌:  ఓయూ విద్యార్థిని అరుణ హత్య కేసులో కీలక నిందితుడు శివకుమార్‌ను పోలీసులు పుణెలో ఈ ఉదయం అరెస్టు చేశారు. ఈ కేసులో శివకుమార్‌ సోదరుడు ప్రభు, స్నేహితుడు ప్రవీణ్‌కుమార్‌ను నిన్ననే పోలీసులు అరెస్టు చేశారు. స్నేహితులు, బంధువుల సమాచారం. సెల్‌ఫోన్‌ ఆధారంగా నిందితుని ఆచూకీ గుర్తించారు. హైదరాబాద్‌ దక్షిణ మండలం టాన్క్‌ఫోర్స్‌ పోలీసులు పుణెలో నిందితున్ని పట్టుకున్నారు. అరుణ హత్యోదంతం నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.