ఓర్వలేకనే ఆరోపణలు

ఎన్నికల్లో గుణపాఠం తప్పదు

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌

వరంగల్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి):ప్రభుత్వం చేస్తున్న సమగ్రాభవృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తూ, అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌

మండిపడ్డారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేశామని, ఇటీవల 119 బీసీ గురుకులాలను ప్రారంభించి వెనుకబడిన బీసీలను విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. వచ్చే ఏడాది మరిన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యాలయాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హావిూలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి రాగానే పెండింగ్‌ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. పేద విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు పింఛన్‌దారులకు రూ.200 ఇస్తే దానిక నాటుగు రేట్లు పెంచి తెలంగాణ ప్రభుత్వం రూ.1000 ఇస్తుంటే జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు రాజకీయ ఉనికిని ఎక్కడ కోల్పోతామనే భయంతో కొంత మంది అమాయకులను పింఛన్‌ రావట్లేదని చిత్రికరించి చిల్లర రాజీయాలు చేస్తూన్నారన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి గురుకులాలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో విద్యారంగంలో ఇంత పెద్ద ఎత్తున గురుకులాలు మంజూరు చేసి ప్రారంభించిన ఘనత లేదన్నారు. మానవ అభివృద్ధి సూచికల్లో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని అందుకే రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యను అందించేందుకు మూడేళ్లుగా సుమారు ఐదు వందల గురుకులాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రైవేట్‌ పాఠశాలలకు

దీటుగా గురుకులాల్లో పేద విద్యార్థులకు అన్ని రకాల వసతులు ఉచితంగా అందిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. అవినీతిరహిత పాలనను అందించడానికి సీఎం కెసిఆర్‌ దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తుందన్నారు. గతంలో అనేక కుంభకోణాలకు పాల్పడ్డవారు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలకు జెండామోసే కార్యకర్తలు లేక ప్రజల్లోకి రావడానికి సిగ్గుపడుతున్నారని ఎద్దేవా చేశారు. వీరికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో టిఆర్‌ఎస్‌ ప్రభంజనం ఉందన్నారు