ఔటర్‌రింగ్‌రోడ్డులో కారు దగ్ధం

hnqwkg5m  
 రంగారెడ్డి జిల్లా: ఔటర్‌రింగ్ రోడ్డులో వేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హిమాయత్‌సాగర్ వద్ద ఔటర్‌రింగ్ రోడ్డుపై జరిగింది. వివరాలు.. రవి అనే సాప్ట్‌వేర్ ఉద్యోగి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న స్పోర్ట్స్ కారు (ఎమ్‌ఎచ్12ఏపీ0055) లో లంగర్‌హౌస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఔటర్‌రింగ్ రోడ్డుపై  వెళ్తున్నాడు.

ఈ క్రమంలో హిమాయత్‌సాగర్ వద్దకు రాగానే కారు డివైడర్‌ను ఢీ  కొనడంతో మంటలు చెలరేగాయి. దీంతో రవి కారును ఆపి వెంటనే బయటకు పరుగు తీశాడు. అదే సమయంలో కారు క్షణాల్లో మంటల్లో చిక్కి  దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు