ఔటర్ వద్ద ప్రమాదంలో ఒకరు మృతి
హైదరాబాద్,నవంబర్29(జనంసాక్షి): నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్‌ఆర్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. టవేరా వాహనాన్ని పాల వ్యాన్ ఢీకొట్డడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసుల అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిట్యాల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న పాలవ్యాన్ యూటర్న్ తీసుకుంటూ అటుగా వస్తున్న టవేరాను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడు చిట్యాల్ మండలం సుంకేనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.