**కంబాలపూర్ లో జీలగ పంట క్షేత్ర ప్రదర్శన**

శ్రీరంగాపురం:జులై 27 (జనంసాక్షి):

శ్రీరంగాపురం మండలం కంబల్లపూర్ గ్రామంలో జీలగ పంట క్షేత్ర ప్రదర్శన చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో ఈ పచ్చి రొట్ట పైర్ల వాడకం వల్ల ఉపయోగాలు తెలియజేయడం జరిగింది.పాలచౌడు,నల్లచౌడు ను నివారిస్తాయి.ఈ జాతి పేర్లకు వేర్లు లోతుగా ఉండి భూమికి అడుగున తయారయ్యే గట్టికూరను చీలుస్తాయి.పచ్చి రొట్టెపైర్లు భూమిలో కుల్లేటప్పుడు రసాయనిక ప్రక్రియలు జరిగి భూమిలోని పోషక పదార్థాలు మొక్కలకు అందుబాటులోకి వస్తాయి.భూమిని గుల్లపరచడం వల్ల నీరు, గాలి సులభంగా వేర్లకు అందుతాయి.వీటిలో సేంద్రీయ పదార్థం ఉంటుంది కావున సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారం పెంపొందించే ప్రక్రియలు త్వరితంగా జరుగుతాయి.రసాయనిక ఎరువుల ఖర్చు వినియోగతలు తగ్గుతాయి , నాణ్యమైన పంట దిగుమతులు వస్తాయి.పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీసీ రెడ్డి, దేవేంద్రమ్మ, పాల్గోన్నారు.వ్యవసాయ విస్తరణ అధికారి వి.యుగంధర్ కంబల్లపూర్ క్లస్టర్.

Attachments area