*కక్కిరేణిలో కాలోజీ నారాయణ రావు 108 వ జయంతి వేడుకలు*
రామన్నపేట సెప్టెంబర్ 9 (జనంసాక్షి) రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో ప్రజా కవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు 108 వ జయంతితోపాటు తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రజావాణి గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త వేముల సైదులు మాట్లాడుతూ…
తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా, రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారంగా కవిత్వం ద్వార హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి.
పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు కాళోజి , నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడనీ..
అతను స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. అతను 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. అతని జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించిందనీ తెలంగాణ భాష పరిరక్షణ కోసం మరియు కాళోజి గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో తేడ్ల రాజకుమార్ , సోమనబోయిన దుఃఖేందర్ , ఈదుల కంటి శివకుమార్ , పాపని జయప్రకాష్ , బెక్కంటి లింగస్వామి తరాల నరసింహ , మోసోజు నరేష్ , నల్ల ప్రసాద్ , సాలయ్య తదితరులు పాల్గొన్నారు..