కడప ఉక్కుపై లోపించిన చిత్తశుద్ది

ముందునుంచి పోరాడిందీ లెఫ్ట్‌ పార్టీలే

ఉమ్మడి పోరాటంతోనే ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యమంటున్న లెఫ్ట్‌ నేతలు

కడప,జూలై4(జ‌నం సాక్షి ): వెనకబడ్డ కడపలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలని ఆది నుంచీ వామపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. అనేక ధర్నాలు,ర్యాలీలు నిర్వహించాయి. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగ యువతను ఆదుకోవాలని పదేపదే కోరుతూ వచ్చాయి. కానీ నాలుగేళ్లుగా బిజెపితో కలసి ఉన్న టిడిపి ఏనాడు కూడా పెద్దగా దీనిపై స్పందిచలేదు.ఇకపోతు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాఉటకు అవకాశాల్లేవంటూ కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించడం ద్వారా బిజెపి ఈ ప్రాంత ప్రజలను వంచిందందనే చెప్పాలి. ప్రత్యేక ¬దా, వెనుకడ్డ ప్రాంతాల అభివృద్ధి, రైల్వే జోన్‌ ఇత్యాది విభజన హావిూలను అమలు పర్చకుండా రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన మోడీ సర్కారుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు కడప ఉక్కు సైతం రాదనడంతో బిజెపి వంచనపై ప్రజల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కడపలో ఉక్కు తయారీకి అనువైన ఇనుప ఖనిజం అందుబాటులో లేదని అక్కడికి దగ్గరలో సముద్రం లేదని ఎన్‌డిఎ ప్రభుత్వం చెబుతున్న కారణాలు కుంటి సాకులు కాక మరోటి కాదని లెఫ్ట్‌ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. విశాఖలో ఉక్కు కర్మాగారం కుదరన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గర్జించి సాధించింది. ఇప్పుడు అదే ఒరవడిలో కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం నవ్యాంధ్రలో మారుమోగుతోంది. రాయలసీమ ప్రజలైతే తాడోపేడో తేల్చుకోవాలన్నంతగా తెగించి ఉద్యమిస్తున్నారు. అఖిలపక్షం పిలుపు మేరకు శుక్రవారంనాటి కడప జిల్లా బంద్‌కు లభించిన అపూర్వ స్పందనే అందుకు నిలువెత్తు నిదర్శనం. బంద్‌ ప్రభావం ఒక్క కడప జిల్లాకే రాయలసీమకే పరిమితం కాలేదు. కడప ఉక్కు సాధనపై ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి తెలిసి వచ్చేలా బంద్‌ నిర్వహించారు. దేశంలో నెలకొల్పిన ఉక్కు

కర్మాగారాలన్నీ సముద్ర తీర ప్రాంతంలో లేవు. నిన్నటిదాకా కేంద్రంలో రాష్ట్రంలో టిడిపి, బిజెపి నేతలు చెట్టపట్టాలేసుకొని తిరిగిన నేతలు ఇన్నాళ్లు ఎందుకు దీనిపై నోరు మెదపలేదని లెఫ్ట్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. వెనుకబడ్డ సీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వరంగంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు కావాలి. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత దేశీయ ఉక్కు ఉత్పత్తి సామర్ధ్యం వంద కోట్ల టన్నులు కాగా దానిని మూడు వందల కోట్ల టన్నులకు పెంచాలని లక్ష్యంగా ప్రకటించిన ఉక్కు మంత్రిత్వశాఖ కడపలో ఉక్కు పరిశ్రమను నిరాకరించడం ఎంత వివక్షతతో కేంద్రం వ్యవహరిస్తున్నదో తెలియజేస్తున్నది. నాలుగేళ్లు బిజెపితో అంటకాగిన టిడిపి అకస్మాత్తుగా ఆ పార్టీ నుంచి బయటపడి ఇప్పుడు విభజన హావిూలపైనా, కడప ఉక్కుపైనా కేంద్రానికి వ్యతిరేకంగా దీక్షలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప చిత్తశుద్ధితో చేసింది కాదు. విభజన హావిూలకై ఉద్యమించిన వారిపై ఉక్కు పాదం మోపిన బాబుకు దీక్షలు చేసే అర్హత ఉందా? కడప ఉక్కు సాధన కోసం టిడిపి నాయకుడు సిఎం రమేష్‌ నిరాహార దీక్షను విరమింపజేస్తూ అవసరమైతే రాష్ట్రమే స్టీల్‌ ప్లాంట్‌ పెడుతుందని ముఖ్య మంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రమే స్టీల్‌ ప్లాంట్‌ నెలకొల్పేటట్లయితే అందుకు ఏర్పట్లు చేసుకోవాలి. నాలుగేళ్లపాటు బిజెపికి అంటకాగి ఆ పార్టీ చేసిన తప్పిదాలన్నింటికీ టిడిపి వంత పాడినందున రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. ఇప్పుడు స్టీల్‌ ప్లాంటు తామే పెడతామనడం ప్రజలను వంచించడం తప్ప మరోటి కాదు.

———-