కడుపుమంటతోనే పసుపు రైతుల దాడి
బోర్డు హావిూ నెరవేర్చకుంటే ఇంకా వెంటపడతారు
బిజెపి యాగీ చేస్తే సమస్య చల్లారదు: జీవన్ రెడ్డి
నిజామాబాద్,జనవరి29 (జనంసాక్షి): పసుపు బోర్డుపై ఇచ్చి మాటను నిలబెట్టుకోనందుకే బిజెపి ఎంపి అర్వింద్‌ను రైతులు నిలదీశారని ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి తెలిపారు. గత మూడేళ్లుగా రైతులకు ఎలాంటి ఊరట దక్కలేదన్నారు. పసుపు రైతులు ఎప్పటికప్పుడునిలదీస్తూనే ఉన్నారని అన్నారు. జీవన్ రెడ్డి విూడియాతో మాట్లాడుతూ..ఇది ఆర్మూర్‌కే పరిమితం కాదని హెచ్చరించారు. అర్వింద్ ఏదో జరిగినట్టు బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ పరామర్శకు వచ్చారని ఎద్దేవా చేశారు. బిజెపోళ్లు రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోలుస్తారా? అని మండిపడ్డారు. ఉగ్రవాదుల కర్మాగారంగా బిజెపి మారిందని దుయ్యబట్టారు. బిజెపోళ్లు ఓట్లు, సీట్ల కోసం కాకుండా ప్రజల గురించి ఆలోచించాలని హితువుపలికారు. ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డును తెస్తానని రైతులకు బాండ్ రాసిచ్చి ఇప్పటికీ తెలేదని, పసుపు బోర్డు తెచ్చే వరకూ రైతులు ఎంపీ అర్వింద్ వెంటపడాలని అన్నారు. మాయమాటలు చెప్పి పసుపు రైతులను ఎంపీ అర్వింద్ మోసం చేశారని, మూడేళ్లు గడుస్తున్న పసుపుబోర్డు తెలేదని, ఆగ్రహంతో ఉన్న పసుపు రైతులు ఎంపీని ఎక్కడబడితే అక్కడ అడ్డుకుంటున్నారన్నారు. దీన్ని రాజకీయం చేస్తూ టీఆర్‌ఎస్‌పై నిందలు మోపడం, అబద్దాలు మాట్లాడడం బీజేపీ నాయకులకు తగదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజల తగిన గుణపాఠం చెబుతారని చెబుతారన్నారు.