కడెం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు
కాల్వల ద్వారా దిగువకు నీటి విడుదల
నిర్మల్,జూలై7(జనం సాక్షి): కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా 25వేల క్యూసెక్కుల నీటిని కిందికిడు విదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్ట 700 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 695.4 అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్ట్ ఇన్‌ఎ/-లో 25వేల క్యూసెక్కులుగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్, బైంసా, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో వాగులు పొంగుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయంఏర్పడింది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పెన్‌గంగా, ప్రాణాహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ నీరంతా దిగువకు చేరుతుండడంతో గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. అటు ప్రాజెక్టులకు వరద పొటెత్తుతోంది. కడెం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 700 అడుగులు కాగా.. 693 అడుగులకు నీరు చేరింది.