కనపడని మోతల బన్సల్ బండి
తెలంగాణకు కోతలే..
కొత్తగా లక్షన్నర ఉద్యోగాలు
ఏడాదిలోటు బడ్జెట్ రూ.24.600 కోట్లు
ఆధార్ ఉంటేనే టికెట్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) :
కేంద్ర రైల్వేశాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ కనబడని మోతలతో మంగళవారం పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగే ఈ బడ్జెట్‌లోనూ తెలంగాణకు మొండిచేయే చూపారు. రామగుండం-మణుగూరు, మంచిర్యాల నుంచి ఉట్నూర్ మీదుగా ఆదిలాబాద్‌కు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు మినహా మనకు ఒనగూరే ప్రయోజనమేది లేదు. ఎప్పటినుంచే డిమాండ్ చేస్తున్న కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, కొత్త రైల్వేజోన్ ఊసేది బడ్జెట్‌లో లేదు. ఉన్న రైళ్లను పొడగింపే తప్ప ఒక్క కొత్తరైలూ ప్రవేశపెట్టలేదు. 17 ఏళ్ల విరామం తరవాత కాంగ్రెస్ మంత్రి ¬దాలో బన్సల్ ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. పలు కొత్త రైళ్లకు ప్రతిపాదనలు, అనేక రైళ్ల పొడిగింపు, సౌకర్యాల మెరుగు పర్చడం వంటి హామీలతో బన్సల్ రైలు పట్టాలకెక్కింది. కాజీపేటలో శిక్షణ కేంద్రం, కర్నూలులో రైల్వే వర్క్ షాప్ వంటి వాటితో సంతృప్తి పరచారు. దేశాన్ని ఏకం చేయడంలో రైల్వేలదే కీలక పాత్రని, దేశాభివృద్ధిలో భారతీయ రైల్వే పాత్ర గణనీయమైందని బడ్జెట్ ప్రసంగంలో బన్సాల్ పేర్కొన్నారు. కుంభమేళా సమయంలో అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయని, ప్రమాద నివారణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. లెవల్ క్రాసింగ్ వద్ద 40 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, కాపలా లేని లెవల్ క్రాసింగ్‌కు లేకుండా చేయడానికి రూ.37 వేల కోట్లు కావాలని రైల్వే మంత్రి చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తామని మంత్రి
తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ వార్నింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెడతామని అన్నారు. రూ. 5.19 లక్షల కోట్లతో 2013-14 రైల్వే బడ్జెట్‌ను మంగళవారం మధ్యాహ్నం బన్సాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రజల ఆకాంక్షను బడ్జెట్ ప్రతిబింభిస్తుందన్నారు. కొత్త ప్రాజెక్టులు, రైళ్ల డిమాండ్లు ఎన్నో ఉన్నాయని అయితే వాటిలో కొన్నయినా నెరవేర్చే ప్రయత్నం చేశామన్నారు. 2001లో రైల్వేల్లో రూ.4,955 కోట్ల నష్టాలు, 2012 నాటికి రూ.24.600 కోట్లు- పెరిగాయన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో లక్ష కోట్ల పనులు చేయాలనుకుంటున్నామని బన్సాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రయాణికులపై ఛార్జీలు పెరగవని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌కు ముందే వాటిని పెంచడంతో ఇప్పుడు బడ్జెట్‌లో మళ్లీ వాటి జోలికి వెళ్లలేదు. అలాగే టికెట్ బుకింగ్ ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నట్లు- తెలిపారు. రిజర్వేషన్‌ను ఎస్‌ఎంఎస్‌తో తెలియజేస్తామన్నారు. మహిళా ప్రత్యేక రైళ్ళకు మహిళా భద్రతా సిబ్బందిని ఏర్పాటు- చేయన్నుట్లు బన్సాల్ స్పష్టం చేశారు. ఆర్‌పీఎఫ్‌లో ఇకపై మహిళలకు 10 శాతం కేటాయించనున్నట్లు మంత్రి చెప్పారు.
కాలం చెల్లిన 17 రైల్వే బ్రిడ్జ్‌ల స్థానంలో ఈ ఏడాది కొత్తగా వంతెనలు నిర్మిస్తాంమన్నారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం మరో ఎనిమిది కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మెట్రో నగరాల లోకల్ రైళ్లలో మహిళా బోగీల్లో మహిళా పోలీసులు ఏర్పాటు చేసి వారికి ఆర్‌పీఎఫ్‌లో ఇకపై 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. విజయవాడ సహా ఆరు చోట్ల మంచినీటి ప్లాంట్ల ఏర్పటు, ఎంపిక చేసిన రైళ్లలో అత్యంత విశాలవంతమైన కోచ్‌లు, ప్రధాన రైళ్లలో ఉచిత వైఫై సౌకర్యం, టికెట్ బుకింగ్ ఆధార్‌తో అనుసంధానం వికలాంగులు, వృద్ధుల కోసం 179 ఎక్స్‌లేటర్లు, 400 లిఫ్టులు. రైల్వే స్టేటస్‌ను చెప్పే ఎస్‌ఎమ్‌ఎస్ వ్యవస్థ, నాణ్యమైన, శుభ్రమైన ఆహారం కోసం చర్యలు బన్సల్ ప్రతిపాదనల్లో ఉన్నాయి. కేంద్రీకృత కేటరింగ్ వ్యవస్థకై టోల్‌ఫ్రీ నెంబర్‌ను మొదలు పెట్టారు. విశాఖలో పర్యాటకుల కోసం లగ్జరీ లాంజ్ ఏర్పాటు, కర్నూలులో రైల్వే వర్క్ షాప్, కాజీపేట సహా 25 ప్రదేశాల్లో శిక్షణా కేంద్రాలు., సికింద్రాబాద్‌లో ఎక్సిక్లూజివ్ సెంట్రలైజ్డ్ -టైనింగ్ ఇనిస్టిట్యూట్ వంటివి మన రాష్టాన్రికి దక్కిన కొత్త ప్రాజెక్టులు. రైల్వేలో ఈ ఏడాది లక్షన్నర ఉద్యోగాలు భర్తీకి సంకల్పించారు.