కన్నడ నటి రమ్యపై దేశద్రోహం కేసు
– పాకిస్తాన్ ప్రజలు మనలాంటి వారే అన్నందుకు
కర్నాటక ,ఆగస్టు 23(జనంసాక్షి): పొరుగుదేశం పాకిస్థాన్‌ను పొగుడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కన్నడ నటి,.మాజీ ఎంపీ రమ్యపై దేశద్రోహం కేసు నమోదైంది. కర్ణాటకలోని మదికేరీలో కత్నమణె విట్టల్ గౌడ అనే న్యాయవాది ఆమెపై కేసు పెట్టారు. శనివారం ఈ కేసు విచారణకు రానుంది. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ కార్యక్రమానికి రమ్య హాజరయ్యారు. తిరిగి భారత్‌కు చేరుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ..పాకిస్థాన్ నరకమేవిూ కాదు.. అక్కడి ప్రజలంతా మనలాంటివారే. మమ్మల్ని వారు ఎంతో బాగా చూసుకున్నారు అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. దీంతో రమ్య వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పాకిస్థాన్‌ను పొగిడేలా మాట్లాడారంటూ ఆమెపై విమర్శలు వెళ్లువెత్తాయి. కన్నడంతో పాటు పలు భాషల్లో నటించిన రమ్య..2011లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల పాక్-భారత్ మధ్య విభేదాల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్..ఆ దేశాన్ని నరకంతో పోల్చిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ దేశాల సమావేశానికి హాజరైన ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా పాక్ వైఖరిని ఖండించారు.