కన్హయ్య నిర్దోషి… విడుదల చేయండి

4

– దేశభక్తి పాఠాలు మీరా మాకు చెప్పేది

– రాజ్యసభలో సీతారాం ఏచూరి

న్యూఢి,ఫిబ్రవరి 25(జనంసాక్షి):  టెర్రరిస్టులకు ఎవరు మద్దతు ఇచ్చినా వారిని శిక్షించాల్సిందే అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. కానీ నిర్ధోషులను మాత్రం వేధించవద్దని  ప్రభుత్వానికి ఆయన హితవు పలికారు. . రోహిత్‌ ఆత్మహత్య, జెఎన్‌ యూ ఘటనలపై రాజ్యసభలో సీపీఎం ఎంపీ ఏచూరీ మాట్లాడారు.  గురువారం రాజ్యసభలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. దేశభక్తి గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ ప్రభుత్వానికి చురక అంటించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే రాజద్రోహులా అని కేందప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఏచూరి ప్రశ్నించారు.  హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య సంఘటనపై పార్లమెంట్‌ స్థాయి సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. విద్యార్థులపై చర్య తీసుకోరాదని ఎన్ని లేఖలు రాసినా వర్సిటీ పట్టించుకోలేదన్నారు. కేంద్ర మంత్రుల ప్రోద్బలం వల్లే విద్యార్థి మరణించాడని ఏచూరి ఆరోపించారు. జాతీయవాదం గురించి ప్రభుత్వం పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ ఎంపీ విూనాక్షీ లేఖ బుధవారం చేసిన మంత్రగత్తె వ్యాఖ్యల పట్ల కూడా ఆయన స్పందించారు. మంత్రగత్తెల భవిష్యవాణి కూడా తెలుసు కోవాలన్నారు. దేశానికి రాబోయే నేత విూ పార్టీ నుంచి ఉండరన్న విషయాన్ని గ్రహించాలని ఏచూరి విమర్శించారు. విద్యార్థులపై వత్తిడిని తీసుకురాదన్నారు. జేఎన్‌యూ విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టడం దారుణమన్నారు. పేదిరకం, ఆర్‌ఎస్‌ఎస్‌, మనువాదం నుంచి విముక్తి కావాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. దేశంలోని అసహన ఘటనలపై విదేశీ పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. విూ చర్యలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తే దేశద్రోహులు అంటారా అన్ని ప్రశ్నించారు. భారతదేశం ప్రజాస్వామ్య, లౌకికదేశమని చెప్పారు. భిన్న వ్యక్తులు, భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారని తెలిపారు. యూనిర్సిటీల్లో పరిణామాలపై హౌస్‌ కమిటీ చేయాలని సూచించారు. ‘మా నుంచి విూరు కోరని సహకారం లభిస్తుందని’ ఏచూరీ హావిూ ఇచ్చారు. దేశ వ్యతిరేక శక్తులను శిక్షించండి… అయితే అందరినీ ఒకే గాడిన కట్టవద్దని హితవు పలికారు.