కమల్‌నాథ్‌ కమిటీ నివేదిక తరువాతే ఉద్యోగాలు

3

-హరగోపాల్‌ కమిటీ నివేదిక యధాతతంగా ప్రభుత్వానికి

-టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంట చక్రపాణి

హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జనంసాక్షి): కమల్‌నాధన్‌ కమిటీ నివేదిక తర్వాతే ఉద్యోగ నియమాకాలు ఉంటాయని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. ఉత్తర్వులు జారీ తమ పరిధి కాదని.. కేవలం పరిగణలోకి మాత్రమే తీసుకుంటామని చక్రపాణి అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఖాళీల సంఖ్య ఆధారంగానే తామునోటిఫికేషన్‌ జారీ చేస్తామని అన్నారు. అంతేగాని కమిషన్‌ తనకుతానుగా నోటిఫికేషన్‌ ఇవ్వదన్నారు. అలాగే ఖాళీలను పేర్కొనదన్నారు. గతంలో ఉన్న పద్ధతిలోనే పరీక్షలు ఉండాలని హరగోపాల్‌ కమిటీ నిర్ణయించిందని వెల్లడించారు. ప్రభుత్వం పూర్తిగా పరిశీలించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తుందని చెప్పారు. జనవరి 3న ప్రొ.హరగోపాల్‌ అధ్యక్షతన నిపుణుల కమిటీ వేశామని.. అందులో విద్యారంగానికి సంబంధించిన నిపుణులను సభ్యులుగా నియమించామన్నారు. ఉపసంఘంలో పరీక్షలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించామన్నారు. పాఠ్య ప్రణాళికలో తెలంగాణ సంస్కృతి, ఉద్యమ చరిత్ర వచ్చే అవకాశముందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్‌ సర్వీస్‌ కవిూషన్‌ పరీక్షల మార్పు, సిలబస్‌ వంటి అంశాలపై వారు చర్చించారు. గ్రూప్‌ 2లోని కొన్ని ఉద్యోగాలను గ్రూప్‌ 1లో చేర్చాలని ప్రొ.హరగోపాల్‌ కమిటీ చేసిన ప్రధాన సిఫార్సును సభ్యులతో ఆయన చర్చించారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ, ప్రొ.హరగోపాల్‌ సిఫార్సులను ప్రభుత్వానికి పంపామని తెలిపారు. పరీక్షలకు సంబంధించి ఉపసంఘంతో సుదీర్ఘంగా చర్చించామని ఆయన తెలిపారు. హరగోపాల్‌ కమిటీ టీచర్ల నియామక పరీక్షల్లో కూడా కొన్ని సూచనలు చేసిందని, వాటిని కూడా ప్రభుత్వానికి పంపామని ఆయన వెల్లడించారు. ప్రొ.హరగోపాల్‌ ఇచ్చిన నివేదికను ఎలాంటి మార్పులు లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చక్రపాణి పేర్కొన్నారు. జనవరి మూడో తేదీన హరగోపాల్‌ అధ్యక్షతన 25 మంది సభ్యులతో ఎక్స్‌ పర్ట్‌ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, అన్ని విభాగాలకు సంబంధించి అధ్యాపకులను సభ్యులుగా ఉంచడం జరిగిందన్నారు. ఈ కమిటీ సబ్‌ కమిటీలు ఏర్పాటు చేసుకుని చర్చలు జరిపిందన్నారు. తెలంగాణ భవిష్యత్‌ నిర్మాణానికి ఉద్యోగుల నియామకం, పరీక్షలు నిర్వహించే విధానం సూచించడం జరిగిందన్నారు. స్కీం..సిలబస్‌ కు తేడా ఉందని తెలుస్తోందన్నారు. పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ స్కీంలు మాత్రమే సూచిస్తుందని, అది కూడా ప్రభుత్వ ఆమోదంతో చేస్తుందన్నారు. హరగోపాల్‌ స్కీంను ఆమోదించి ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, తరువాత ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందన్నారు. అనంతరం పూర్తిస్తాయి సిలబస్‌ ను ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రూప్‌ -1 పరీక్షా విధానంలో ఎలాంటి మార్పు లేదని, గతంలో ఉన్న పరీక్షల విధానమే ఉండాలని కమిటీ పేర్కొందన్నారు. సిలబస్‌ లో తెలంగాణ సంస్కృతితో పాటు ఉద్యమ చరిత్రను చేర్చే అవకాశం ఉందని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. అలాగే అన్ని రకాల విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా సిలబస్‌ ఉంటుందన్నారు.