*కమ్మర్పల్లి లో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం*
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నిజమాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మంగళవారం రోజున సాయంత్రం సమయంలో ఆర్మూర్ ఏసిపి ఆర్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారక ద్రవ్యాలు వినియోగం వల్ల జరిగే అనర్థాల గురించి కాలనీవాసులకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్పడం జరిగింది. అలాగే కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా చాలా వరకు దొంగతనాలు అరికట్టవచ్చని తెలిపారు. అలాగే వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ సీట్ బెల్టు తప్పనిసరిగా ధరించాలని కోరారు మరియు సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీంగల్ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ సిఐ గోవర్ధన్ రెడ్డి ,కమ్మర్పల్లి ఎస్సై రాజశేఖర్, మరియు ఆర్మూర్ సబ్ డివిజన్ లోని ఎస్సైలు కమ్మరపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.