కమ్యూనిస్టులదే సాయుధ పోరాట చరిత్ర. 14 నుండి విజయవాడలో సిపిఐ జాతీయ మహాసభలు.
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 15(జనంసాక్షి):
తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర కమ్యూనిస్టులే వహించారని బిజెపి కాంగ్రెస్ పార్టీలు కాదని నేడు బిజెపి రాజకీయ కుట్రకు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు అనేక మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని వివరించారు.రాజులకు పన్ను కట్టడానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కమ్యూనిస్టులు విరోచితంగా పోరాటం చేసి నిజాం నవాబులను ఈ ప్రాంతం నుండి తరిమికొట్టడం జరిగిందని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొనలేదని కానీ సంఘీభావం తెలిపారని బిజెపి పాత్ర ఏమాత్రం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం కు బెదిరి అధికారికంగా నిర్వహించడం లేదని అన్నారు.రాజకీయ కుట్రలో భాగంగానే టిఆర్ఎస్ బిజెపిలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నారని మండిపడ్డారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం జరుగుతుందని వాటికి వ్యతిరేకంగా ఉన్న శక్తులపై ఈ డి సి ఐ డి లతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వాలను పడగొడుతున్నా రని అన్నారు బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని కోరారు బిజెపి వ్యతిరేక శక్తులలో పట్ల కెసిఆర్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం జరిగిందని అన్నారు వచ్చే నెల 14 నుండి 18 వరకు సిపిఐ జాతీయ మహాసభలను విజయవాడ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ కార్యవర్గ సభ్యులు కేశవులు గౌడ్ నాయకులు రామకృష్ణ భరత్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు