కమ్యూనిస్టుల త్యాగాల ఫలితమే తెలంగాణ విముక్తి.

 సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి
డోర్నకల్ సెప్టెంబర్ 13 జనం సాక్షి

కమ్యూనిస్టుల వీర పోరాటాల త్యాగాల ఫలితంగానే దొరల నైజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ విముక్తి గావింపబడ్డదని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి అన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 74 వ వార్షికోత్సవల సందర్భంగా సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన జీప్ జాత పెరుమల్ల సంకిసా గ్రామంలో నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారుల  దాస్టికాలకు 20 మంది సజీవ దహనం కాబడ్డ ప్రాంతంలో అమరవీరులకు నివాళి అర్పించి అరుణ పతాకాన్ని ఎగురవేసిన విజయ సారథి మాట్లాడుతూ… నాటి వీరొచిత చరిత్రను మసిపూసి మారేడు కాయలు చేసే  బీజేపీ మతోన్మాధవాదుల ఆటలు తెలంగాణ గడ్డపై కొనసాగవని నాడు తెలంగాణ గడ్డపై దొరలు దేశ్ ముకులు రజాకార్ ల ఆగడాలకు  వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వంలో నిజాం ప్రభువును తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులదనే వారి పోరాటాల స్ఫూర్తితో అసమానతలకు వ్యతిరేకంగా మతోన్మాదులపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు.కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్,నెల్లూరు నాగేశ్వరరావు,పెరుగు కుమార్,
పాండురంగాచారి,చింతకుంట్ల వెంకన్న, తురక రమేష్,నవీన్,శ్రావణ్,సందీప్,రవి ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొన్నారు.