కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ ధర్నాలు
కరీంనగర్: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ వ్యక్తం చేస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. కరీంనగర్, నిజామాబాద్‌లలో ఉన్న పోలీసు హెడ్ క్వార్టర్‌ల ముట్టడీకి ఆపార్టీ నేతలు, కార్యకర్తలు యత్నించారు. వీరి యత్నాన్ని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడటంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు. ఈ లాఠీఛార్జీలో కరీంనగర్‌లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.