కరీమాబాద్ లో కాంగ్రెస్ నాయకుల నిరసన
వరంగల్ ఈస్ట్ జూలై 28 (జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ శాఖ రాశి కుంట వద్ద ప్రధాన రహదారిపై నిర్వహిస్తున్న మోరి నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యం నిరసిస్తూ కొండా దంపతుల ఆదేశాల మేరకు అండర్ రైల్వే గేట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎండి అత్తర్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్గొండ రమేష్ కొత్తపల్లి శ్రీనివాస్, కరాటే ప్రభాకర్ ,బెడద వీరన్న, రేణిగుంట్ల శివ, దాసరి రాజేష్. సారా సాంబయ్య, వినోద్ చిలువేరు చిలువేరు శ్రీనివాస్ రావు టాబ్బు ముద్దసాని రాధిక, శ్రీనివాస్, శేర్ల కిషోర్ ,బెబ్బులి మహిళా నాయకురాలు పసునూరి సువర్ణ, ముద్ధసాని రాధిక, బురిశెట్టి శ్రీలత , కళ్యాణి ,అనిత, ఎండీ మోయిన్ దయ్యాల కృష్ణ చందర్ రావు గజ్జల నాగరాజ, న్యలపోగుల ప్రశాంత్ ,తోట సతీష్ ,కొత్త విశాల పోతురాజు యాదగిరి మైదాం అశోక్ నలుగంటి సులొపెన్, మైదం క్రాంతి, తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు నల్గొండ రమేష్ మాట్లాడుతూ అండర్ రైల్వే గేట్ ప్రాంత ప్రధాన రహదారి అయిన కరీంబాద్ రంగసాయిపేట వెళ్లే ప్రధాన జంక్షన్ సాకరాచికుంట వద్ద డ్రైనేజ్ పనులు నిర్లక్ష్యం వలన అండర్ రైల్వే గేట్ ప్రాంత ప్రజలు స్కూల్ వాహనాలు అంబులెన్స్ సర్వీసులు విద్యాసంస్థలకు వెళ్లేవారు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు అదేవిధంగా ఖమ్మం బైపాస్ లింక్ రోడ్డు గా ఎంతో రద్దీగా ఉండే ఈ నిర్మాణం పనులను వెంటనే చేపట్టాలని అండర్ రైల్వే గేట్ ప్రాంత కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్గొండ రమేష్ వచ్చిమాట్లాడడం జరిగింది
Attachments area
|
|