కరువు ప్రాంతాలకు కేంద్రం సాయం
ఢిల్లీ: దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులపై శరద్‌పవార్ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల సాధికార బృందం మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. కరువు పరిస్థితులున్న రాష్ట్రాలకు రూ. 1900కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. సాగునీటి పంపుల కోసం రైతులకు డీజిల్‌పై 50శాతం రాయితీ ఇస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్ తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌లో వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ పథకానికి రూ.1440కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విత్తనాలపై రాయితీ పెంచాలని కూడా కేంద్ర మంత్రుల సాధికార బృందం నిర్ణయించింది.