కరెంటు చార్జీల బాదుడుకు రంగం సిద్ధం

2

హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జనంసాక్షి): తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలను డిస్కంలు శనివారం సాయంత్రం ఈఆర్సీకి సమర్పించాయి. దాంతో తెలంగాణలో సుమారు రూ.4200 కోట్ల మేర విద్యుత్‌ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతించగానే విద్యుత్‌ ఛార్జీల పెంపుపై  ఈఆర్సీ నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీలు పెంపునకు

ప్రభుత్వం పావులు కదుపుతున్న సంగతి తెలిసింద. ఏపీలో విద్యుత్‌ చార్జీలను 6 శాతం పెంచాలన్న అంశాన్ని ఈఆర్సీ పరిశీలిస్తోంది.