కరోనాతో దెబ్బతిన్న రవాణారంగం
పెట్రో దరలతో మరింత అధ్వాన్నం
విశాఖపట్నం,ఆగస్ట్10(జనంసాక్షి): ప్రస్తుతం రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. పెట్రో ధరల పెంపుతో ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడిరదన్నారు. అలాగే ఖర్చులు కూడా పెరిగాయన్నారు. దీనికితోడు కరోనాతో అసలు వ్యాపారం ముందుకు సాగడం లేదన్నారు. మంగళవారం అసోసియేషన్ ప్రతినిధులు విూడియాతో మాట్లాడుతూ.. డీజిల్ ధరలు బారీగా పెరుగుతుండడంతో లారీలను నడపలేని పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోన సమయంలో అందర్నీ ఆదుకున్నట్లే.. ప్రభుత్వం తమను కూడా అదుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతకాలం తమ రవాణా నిలిచిపోయిందన్నారు.