కర్నాటకలో విస్తారంగా వర్షాలు

శివమొగ్గలో అత్యధికంగా వర్షపాతం

బెంగళూరు,జూన్‌5(జనం సాక్షి): కర్నాటకలో నైరుతి రుతుపవనాల జోరుమొదలయ్యింది. ఆరంభంలోనే వరుణుడు తీవ్ర ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శివమొగ్గ జిల్లాలో భారీ వర్షాల కారణంగా తుంగా జలాశయం పూర్తిగానిండిపోవడంతో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు దావణగెరె, తుమకూరు, మైసూరు, మండ్య, రామనగర, ఉత్తర కన్నడ, ఉడుపి, హాసన్‌, కొప్పళ జిల్లాల్లో ఓమోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. తుమకూరు జిల్లాలో అనేక సెలయేళ్లు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఈ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం. అత్యధికంగా శివమొగ్గ జిల్లాలో 114 మిల్లీవిూటర్ల వర్షం కురిసింది. కార్వారలో 70, మంకి, తిపటూరు, బళ్లారి- 60, అళంద్‌, జయపుర, ఆగుంబె, చిక్కమగళూరు, మద్దూరు- 50, ఉమ్నాబాద్‌, తాళగుప్ప, హాసన్‌- 40, హళన్నావర, అంకోలా, కొల్లూరు, శిరాళి, గంగావతి, కడూరులో 30 మిల్లీ విూటర్ల వర్షం కురిసింది. రాబోయే రెండు రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నాయని ప్రాంతీయ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమను ఆనుకుని ఉన్న బళ్లారి ప్రాంతంలో కూడా వర్షౄలు పడుతున్నాయి. అనంతలో కూడా వర్షాలు ఒదలయ్యాయి.

—-