కర్నాటక సిఎంగా నేడు కుమారస్వామి ప్రమాణం

హాజరు కానున్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
విధానసౌధ ద్వారం వద్దే ప్రమాణ ఏర్పాట్లు
బెంగళూరు,మే23(జ‌నం సాక్షి ): కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది.కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా హెచ్‌.డి.కుమారస్వామి బుధవారం ప్రామనం చేయనున్నారు. జెడిఎస్‌,కాంగ్రెస్‌ సంకీర్ణ కూటమికి ఆయన సారధ్యం వహించనున్నారు. విధానసౌధ తూర్పు ద్వారం మెట్లపై బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అక్కడ వేదిక నిర్మాణ పనులు చేపట్టారు.  కొత్తగా నిర్మించిన వేదికపై అర్చకులు శాంతి పూజలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న ఆనందం కన్నా.. ప్రజలకు ఇచ్చిన హావిూలను వేగంగా నెరవేర్చాలన్న ఆత్రుతే నాలో ఉందని ఈ సందర్భంగా కుమారస్వామి అన్నారు.  పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఉంటే బాగుండేదనిపిస్తోంది. డి.కె.శివకుమార్‌తో వ్యక్తిగత వైరం ఏవిూ లేదు. ఈ ఎన్నికల్లో ఇద్దరం మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ట్రోఫీని దక్కించుకున్నాం. గత సంకీర్ణ ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ తలెత్తకుండా చూసుకునేందుకు ప్రాధాన్యమిస్తానని అన్నారు. ప్రమాణ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు హాజరు కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్ఠానంతో కుమారస్వామి చర్చలు జరిపారు. ఇకపతోఏ కీలకమైన ఉపముఖ్యమంత్రి, ¬ంమంత్రి, స్పీకర్‌ పదవులను కాంగ్రెస్‌ కోరుకుంటోంది. ఈ మేరకు స్పీకర్‌ నియామకంపై కాంగ్రెస్‌-జేడీఎస్‌ మధ్య ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. జేడీఎస్‌ కంటే తమకు ఎక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో స్పీకర్‌ పదవి తమ పార్టీ సభ్యుడికే ఇవ్వాలని కాంగ్రెస్‌ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉపముఖ్యమంత్రి పదవిపై గందరగోళం నెలకొంది. లింగాయత, దళిత నాయకులకు తలా ఒక ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని జనతాదళ్‌ నాయకుల వద్ద పలువురు కాంగ్రెస్‌ ప్రముఖులు ప్రస్తావించినట్లు సమాచారం. కాగా.. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్‌ నేత రోషన్‌ బైగ్‌ లేదా ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని ఉపముఖ్యమంత్రిని చేయాలని ఆ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు బాధ్యతను కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలకే అప్పగించింది. బలపరీక్ష తర్వాతే మంత్రివర్గంపై స్పష్టత వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాలతో ముందుకు
బీజేపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడం, మతతత్వ శక్తులు, జాతి సమైక్యతను దెబ్బతీసే శక్తులను అడ్డుకోవడమే లక్ష్యంగా జేడీఎస్‌కు కాంగ్రెస్‌ మద్దతిచ్చినట్టు ప్రకటించిన కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి విషయం పైనా తన మనసులో మాట బయటపెట్టారు.
నా బలమేమిటో చూపించాలని నేను ఎంతమాత్రం అనుకోవడం లేదు. సంఖ్యా బలమూ చూపించబోవడం
లేదు. రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీలపై నాకు విశ్వాసం ఉంది. పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్య మమనే ఏక వాక్య తీర్మానాన్నే నేను నమ్ముతాను. ఎవరికి ఏమివ్వాలనేది అధిష్టానమే చెబుతుంది’ అని డీకే అన్నారు. ఇటీవల బీజేపీ బలపరీక్షను నిలువరించేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందర్నీ ఏకతాటిపై నడిపి సమర్ధుడైన వ్యూహరచయితగా డీకే సత్తా చాటుకోవడంతో ఆయన పేరు మరోసారి మారుమోగింది. డిప్యూటీ సీఎంగా జి.పరమేశ్వర పేరు ఇప్పటికే ప్రచారంలో ఉండగా, కేపీసీసీ పదవి డీకేకు ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
——————