కలగా మారిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల
బోథ్ జూన్ 28 (జనంసాక్షి) : వెనుబడిన విద్యార్థలను ఆసరా ఇచ్చి ముందుకు తీసుకువచ్చే లక్ష్యంతోనే మారుమూల ప్రాంతాలకు సౌకర్యంవంతంగా కొత్త వాటిని మంజూరు చేస్తారు.అలాగే వెనుకబడిన ప్రంతంగా గుర్తించి,అత్యధికంగా గిరిజనులు ఉండే నియోజకవర్గం కావడంతో దశాబ్ద కాలం క్రితం ప్రభుత్వం బోథ్‌కు డిగ్రీ కళాశాలను మంజూరు చేపింది.కళాశాల నడుస్తంది కూడా.బోథ్‌లో ప్రభుత్వ డిగ్ర కళాశాల ఉందని వెతికేకు సుమీ,భూతద్దం వెతికినా దొరకదు.కాగితాల్లో మాత్రం నడుప్తున్నా,దానిని ఆదిలాబాద్ డిగ్రకళాశాలలోనే మమ అనిపిస్తుపన్నారు.ఇదేంటంటే బోథ్‌లో సరైన స్థలం దొరకలేదట,సిబ్బంది కూడా లేరట.ప్రతీ యేడు అడ్మీషన్ల పేరిట పాంప్లేట్లు,తదితరల ఖర్చు మాత్రం ఖజానా నుండి విడుదలవుతూనే ఉంది.ఇలా అన్నీ ఉన్నా అల్లుని నోట్ల శని అన్న చందాన ప్రభుత్వం తమ కోసం డిగ్రీ కళాశాల మంజూరు చేసినప్పటికీ కింత మంది అధికారులు తమ ప్రయోజనాల కోసం గిరిపుత్రుల వాకిటి దాకా వచ్చిన చదువును అందకుండా చేస్తున్నారు.చిత్రమేమిటంటే అడ్మిషన్ల కోసం బ్రోచర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల @ఆదిలాబిద్ అని ప్రింట్ చేయించారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు ఈ విషయంలో పట్టించుకుంటే ఈ ప్రాంత వాసులకు న్యాయం చేసిన వారవుతారు.