కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు-నివారణ

 

నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నాగర్ కర్నూల్ ప్రాంగణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి నాగర్ కర్నూల్ జిల్లా శాఖ సహకారంతో జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన పోస్టర్లు,కరపత్రాలను ఆవిష్కరించడంతో పాటు పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సెక్రెటరీ సి.రమేష్ రెడ్డి మాట్లాడుతూ,సిజనల్ వ్యాధుల ప్రబలే అవకాశం ఉన్నందున విద్యార్థులందరూ అప్రమత్తంగా ఉండాలని,మీకు సీజనల్ వ్యాధులపై అవగాహన ఉంటే మీకుటుంబాలు,బందువులతో పాటు మీగ్రామాలలో మీరు అవహగహన కల్పించగలరనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని,జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లుగా అది మీబాధ్యత అని గుర్తు చేశారు.సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు.కాచి చల్లార్చిన నీటినే త్రాగలని,త్రాగు నీటి వనరులన్నింటికి తప్పక క్లోరినేషన్ చేయాలని.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,నిలువ ఆహార పదార్థాలను కుళ్లిపోయిన పండ్లు,కూరగాయలు తినకూడదు.వేడి వేడి ఆహారపదార్థాలను మాత్రమే తినాలని,ఆహారం తీసుకునే ముందు,మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.దోమలు పుట్టకుండా,కుట్టకుండా నీరు నిల్వ లేకుండా చూడాలి.ప్రతి కుటుంబం వారంలో ఒకరోజు డ్రైడే ని పాటించాలి.ఏ విధమైన అనారోగ్యం అనిపించిన సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి.పాటశాల ప్రధానోాధ్యాయుడు కుర్మయ్య మాట్లాడుతూ,విద్యార్థులు ఆరుబయట తోపుడు బండ్లలో అమ్మే పాని పూరి,లాంటి నిల్వ ఉండే ఆహాపదార్థాలు తినొద్దని,విద్యార్థులు సామాజిక సేవా కార్య్రమాల్లోనూ ముందుండాలని,మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉంచుకోవాలనీ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ రెడ్ క్రాస్ కన్వీనర్ డి.కుమార్,బ్లడ్ డొనషన్ కన్వీనర్ రాజ్ కుమార్,పాటశాల రెడ్ క్రాస్ కన్వీనర్లు సురేష్ బాబు,శ్రీలత,రెడ్ క్రాస్ సభ్యులు కృష్ణరావు,పాఠశాల ఉపాద్యాయులు పాల్గోన్నారు.