కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ : జడ్పిటిసి,ఏఎంసీ చైర్మన్.
దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు శనివారం జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాసు గౌడ్,ఏఎంసీ చైర్మన్ ఇప్ప లక్ష్మి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదు అన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తుంది అన్నారు. కాన్పు సమయంలో అంగన్వాడీల ద్వారా పాలు గుడ్లు మంచి భోజనాన్ని గర్భిణీ స్త్రీలకు పోషకహార రూపంలో అందజేస్తుందని, ప్రసవ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే 12 వేల రూపాయలు,కేసీఆర్ కిట్టు అందజేస్తుందన్నారు.ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పూజిత వెంకటరెడ్డి,కావేటి సప్న,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్,డిప్యూటీ తాసిల్దార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area