కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎంపిపి రాథోడ్ సజన్

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలులో ఉందని అమ్మాయిల పెళ్లిళ్లకు తల్లిదండ్రులకు భారం కాకూడదని మన సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టారని మండల ఎంపీపీ రాథోడ్ సజన్ స్థానిక సర్పంచ్ పెంట వెంకట రమణ. అన్నారు.మంగళవారం రోజున మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సూచనల మేరకు కల్యాణ లక్ష్మీ,సాది ముబారక్ లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను మండల ఎంపీపీ రాథోడ్ సజన్ తోపాటు స్థానిక సర్పంచ్లు కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పేద ఆడపడుచుల పెళ్లిళ్లు ఘనంగా చేసుకోవడానికి కల్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రాథోడ్ సజన్ స్థానిక సర్పంచ్ పెంట వెంకట రమణ వైస్ ఎంపీపీ మహేందర్ రెడ్డి రెవెన్యూ డిటి సీనియర్ అసిస్టెంట్ మిరబాయి వివిధ గ్రామ సర్పంచ్లు పార్టి సీనియర్ నాయకులు ఆడే జనార్ధన్ జిల్లా లైవ్ అధ్యక్షుడు మహేందర్ జాధవ్ కరణ్ శ్రీనివాస్ రెడ్డి చంద్రశేఖర్ ఎంపీటీసీలు మండల నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.