కల్లు గీత కార్మిక సంఘం పోరాట ఫలితమే సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు జీవో
తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం పోరాటాల ఫలితమే ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు జీవో జారీ చేసిందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మడ్డి అంజిబాబు అన్నారు మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాటమే ఫలితముగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ట్యాంక్ బండి పై పెడుతున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలని 367 సంవత్సరాల క్రితమే అరాచకం చేసేవాళ్లను అరికట్టానికి కులమతా బేధం లేకుండా 12 మందితో తయారై 12,000 వేల మంది సైన్యాన్ని తయారుచేసి ఆరాచకలను అంతం చేసి పోరాటం చేసిన వ్యక్తి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాలు పెట్టకపోవడం పాఠ్యపుష్కలో చేర్చకపోవడం చాలా బాధాకరమైన విషయమని అలాగనే గోల్కొండ కోటపై విగ్రహం ప్రతిష్ట చేయాలని ప్రతి జిల్లా మండల కేంద్రంలోనూ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన పేరు మీద జిల్లా ప్రకటన చేయాలని ప్రతి గ్రామంలోని సర్దార్ సర్వాయి పాపన్న పేరు మీద కమిటీ హాల్ ఏర్పాటు చేయాలని 2016 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కిలాష్ పురం నుండి బస్సు జైత్రయాత్ర ప్రారంభించారని అప్పటి శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శులు మాటూరు బాలరాజ్ గౌడ్ ఎం వి రమణ రాష్ట్రం కమిటీ నాయకులు ఏలుగూరు గోవిందు బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొని ట్యాంక్ బండిపై విగ్రహం ప్రతిష్ట చేయాలని 18 రోజులు అన్ని జిల్లా కేంద్రాలలో బస్సు జైత్ర యాత్ర పర్యటన చేసినారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పొడిసేటి సైదులు అబ్బ గాని కాశయ్య బోడ సైదులు మామిడి వెంకన్న శనగాని రాంబాబు గుండు ఉప్పలయ్య మేకపోతుల రాందాస్ పందిరి సైదులు బోడ పరశురాములు గోపగాని ఎంకన్న శనగాని సైదులు గునుగుంట్ల సైదులు సోషల్ మీడియా మండల కన్వీనర పుట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు.