కల్వకుర్తిలో కానరాని భద్రత
•బ్యాంకులో కానరాని భద్రత
•ఇంట్లో డబ్బులు ఉంటే దొంగల బెడద
•నిత్యం ఏదో ఒకచోట పట్టణంలో దొంగతనాలు
•ఏటీఎంలు లూటీ కాకముందే భద్రత పెంచండి
నాగర్ కర్నూల్ బ్యూరో సెప్టెంబర్ 13 జనం సాక్షి: కుటుంబంలో ఏ ఆపద వచ్చినా అత్యవసర ప్రయాణాలు మరియు వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతి ఇంట్లో 1000 నుంచి పదివేలకు పైగా స్తోమత కి తగ్గట్లు ప్రతి కుటుంబం డబ్బును జమ చేసుకొని ఉంచుకుంటుంది. కానీ కల్వకుర్తి పట్టణంలో వరుస దొంగతనాల కారణంగా డబ్బులు ఎక్కడ దాచుకోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అటు ధనికులే కాకుండా సామాన్య ప్రజలు సైతం జంకుతున్నారు . డబ్బు కానీ ఆభరణాలు గాని ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులో భద్రత ఉంటుందని అందరూ అనుకుంటారు కానీ . మంగళవారం సాయంకాలం తన అకౌంట్లో 40 వేల రూపాయలను జమ చేసుకునేందుకు పట్టణ పౌరుడు కల్వకుర్తిలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లో ఏటీఎం కార్డు ద్వారా డిపాజిట్ చేస్తున్న క్రమంలో మిషన్ లో 40 వేల రూపాయలు పెట్టి డిపాజిట్ చేయగా 40 వేల రూపాయలు మిషన్లో స్టక్ అయ్యాయి. కంగుతున్న బాధితుడు వెంటనే బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటనను వివరించాడు దానికి బ్యాంకు సిబ్బంది నుంచి వచ్చిన సమాధానంతో మరింత అవాక్కయ్యాడు. ఉదయం నుంచి దాదాపు ఏడు మంది ఖాతాదారులు ఒకరు లక్ష రూపాయల మరొకరు ఇరవై వేలు మరొకరు 40వేలు మిషన్ లో స్టక్ అయ్యాయి . ఇదే సమస్యతో ఉన్నారని మీరు ఎనిమిదవ వ్యక్తి అని మీరు కూడా వారిలాగే కంప్లైంట్ రాసిస్తే డబ్బులు వచ్చినప్పుడు మీకు సమాచారం ఇస్తాము కంప్లైంట్ ఇచ్చి వెళ్లవలసిందిగా సమాధానం రావడంతో అదేంటి ఉదయం నుంచి సమస్య ఉన్నప్పుడు ఏటీఎంను తాత్కాలికంగా మూసివేయొచ్చు కదా అని బాధితుడు అడగగా మూడో కంప్లైంట్ తీసుకున్నప్పుడే ఏటీఎం షట్టర్ క్లోజ్ చేసాము ఎవరు ఓపెన్ చేశారో తెలియదు అని పొంతనలేని సమాధానం ఇస్తూ నువ్వు వచ్చి ఉచిత సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళు అని దురుసుగా సమాధానం ఇవ్వడంతో బాధితుడు చేసేదేమీ లేక కంప్లైంట్ ఇచ్చి బయటికి వచ్చాడు.
పట్టణంలో దాదాపు 6 నుంచి 8 ఏటీఎం లు ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకులో ఉన్నప్పటికీ ఖాతాదారులకు మాత్రం సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు.
పట్టణంలోని ఏ ఒక్క ఏటీఎం దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఉండరు అంతేకాకుండా బ్యాంకు సిబ్బంది సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అనే ధీమాతో ఉంటారు కానీ కలవకుర్తిలో జరుగుతున్న దొంగతనాలలో సీసీ కెమెరాలు సంబంధించిన (డి వి ఆర్)హార్డ్ డిస్క్లను సైతం దొంగిలించడంతో దొంగలను పట్టుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది . పట్టణంలో ఒకటి లేదా రెండు ఏ టీంలో మాత్రమే పనిచేస్తుంటాయి అందులో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు స్పందించాల్సిన అధికారులు దురుసుగా వ్యవహరిస్తుండడతో
బాధితులు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు.
ఓ పక్క వరుస దొంగతనాలు మరో పక్క భద్రత లేని బ్యాంకులు, పట్టింపు లేని సిబ్బంది మొత్తానికి పది రూపాయలు సంపాదించి ఎక్కడ దాచుకోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కల్వకుర్తి పట్టణవాసులు ఉన్నారు. వరుస దొంగతనాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు మరియు ఏటీఎం రంగ సంస్థలు మరింత భద్రతను పెంచవలసిందిగా పట్టణవాసులు కోరుతున్నారు.