కళాకారున్ని సన్మానించిన ఎస్ ఓ టు జిఎం లలిత కుమార్

పినపాక నియోజకవర్గం ప్రతినిధి అక్టోబర్ 15 (జనం సాక్షి): గత 20 సంవత్సరాలుగా మణుగూరు ప్రాంతంలో సింగరేణి ఔత్సాహిక వర్ధమాన కళాకారులు నిర్వహించే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు కాస్ట్యూమ్స్, మేకప్ మెన్, పద్య గాయకుడిగా, డోలక్ ,కంజర్ భిన్న ప్రతిభా పాటవాలు కలిగిన పాల్వంచకు చెందిన చింతలచెరువు గోవర్ధన్ ను మణుగూరు ఏరియా సింగరేణి కళాకారులు శనివారం మణుగూరు ఓసి లో శాలువా పుష్పగుచ్చం జ్ఞాపికలతో ఏరియా ఎస్ ఓ టు జిఎం డి లలిత కుమార్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తి పట్ల అంకితభావం, సమయ పాలన, పౌరాణిక పాత్రలో నటించాలని ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించటం వారిని ఆ స్థాయిలో నటించటంలో అభినయం,హవభావాలను ప్రకటించడంలో పద్య గీతాలు ఆలపించడంలో వారికి శిక్షణ ఇచ్చి వాని ప్రోత్సహించే విషయంలో గోవర్ధన్ పాత్ర ప్రశంసనీయమని ఆయన కొనియాడారు, డబ్బుకు ప్రాధాన్యత నుంచి ఈ రోజుల్లో ఇలాంటి పౌరాణిక జానపద పద్య నాటక కళాకారుడ్ని సన్మానించుకోవటం ఎంతో గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జెవి రమణ, మణుగూరు ఓసి సీనియర్ పిఓ పి అవినాష్,ఏరియా సింగరేణి కళాకారులు ఎస్ డి నా సర్ పాషా, ఎన్ సి హెచ్ పవన్ కుమార్, మహి వికెందర్, జంగం రాజ్ కుమార్, జర్పుల రాము, కొత్త సత్యనారాయణ,కోడి రెక్కల శ్రీనివాస్, ప్రవీణ్, దేవవరం, వాంకుడోత్ నరేష్,కనక లక్ష్మి, మాధురి తదితరులు పాల్గొన్నారు.