కళాశాలల వివరాలు అందజేయాలి
ఖమ్మం, ఆగస్టు 3 : జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తమ కళాశాలలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఆర్‌ఐఓ విశ్వేశ్వరరావు చెప్పారు. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలలు ఎప్పుడు స్థాపించారో, ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారో, సీట్ల వివరాలు, బోధన, బోధనేతర సిబ్బంది వివరాలు తమకు అందజేయాలన్నారు. ఒక వేళ కళాశాలల యాజమాన్యం హాస్టళ్లు నిర్వహిస్తే వాటి వివరాలు కూడా తెలపాలన్నారు. పూర్తి వివరాలు నిబంధనల ప్రకారం అందజేయాలన్నారు. జిల్లాలోని వివిధ కళాశాల యాజమాన్యాలు ఇందుకు సహకరించాలన్నారు.