కళాశాల బస్సు, లారీ ఢీ : ముగ్గురి మృతి
వరంగల్ : వరంగల్ జిల్లా గణపురం మండలం మైలారం వద్ద కళాశాల బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. కళాశాల బస్సు డ్రైవరుతో పాటు మౌనిక, రష్మిని అనే ఇద్దరు విద్యార్థినులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.