కళా ఉత్సవ్‌కు జనగామ విద్యార్థుల ఎంపిక
జనగామ,నవంబర్10(జనంసాక్షి): జాతీయ స్థాయి కళా ఉత్సవ్ – 2018 పోటీలకు జనగామ జిల్లా విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఎన్‌సీఈఆర్‌టీ గోదావరి హాల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపికలలో పాల్గొన్న జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి గౌసియా బేగం తెలిపారు. చిత్ర లేఖనం పోటీల్లో జిల్లా కేంద్రంలోని ఏకశిల పబ్లిక్ స్కూల్‌కు చెందిన బి. అంజనా మహేశ్వరి, స్టేషన్ ఘన్‌పూర్‌లోని సెయింట్ మేరీస్ స్కూల్‌కు చెందిన సీహెచ్. తరుణ్, పాటల పోటీలో
బచ్చన్నపేట మండలం కట్కూరు జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఎస్కే. సయీద్, ఎంపికయ్యారు. వీరు డిసెంబరులో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారు.